శ్రీ భువనేశ్వరీ పీఠ విలసనక్రమము
ఈ పీఠముశృంగేరీశ్రీ విరూపాక్షశ్రీపీఠము వారి భారతీ సంప్రదాయమునకు చెందినది. ఇప్పుడున్న శ్రీ శృంగేరీ శారదా పీఠము శ్రీ విద్యారణ్య స్వామి వారి కాలమున రెండు శాఖలుగా రూపమొందినది. దాని
వివరము :-
జగద్గురు శ్రీ శంకరాచార్యులవారు క్రీ.పూ. 480 సం|| క్రిందట ధర్మ రక్షణకై భారతదేశము యొక్క నాల్గు దిక్కులలో నాల్గు పీఠములను స్థాపించియుండుట జగద్విది తము. అందు వారు తమ 18వ యేట ప్రప్రథమముగా స్థాపించిన పీఠము శృంగేరియందు శ్రీశృంగేరీశార దాపీఠము. అందు సురేశ్వరా చార్యులను పీఠాధిపతిగా నియమించిరి. ఆ పీఠముయొక్క శిష్య పరంపరలో చతు ర్వేద భాష్యకర్తలు మహా తపస్సంపన్నులగు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు క్రీ.శ. 1331లో పీఠాధిపతు లైరి. వారు వచ్చిన 5 సం॥కే కాకతీయ సామ్రాజ్యముపై మహమ్మదీయుల దండయాత్ర జరిగెను. కాకతీయోద్యోగులైన హరిహరుడు, బుక్కయ్యలు శ్రీ విద్యారణ్యుల వారిని శరణు జొచ్చిరి. వారి కభయమిచ్చి హంపి వద్ద రాజధానీ నగరమును నిర్మించి దానికి విజయనగరమని పేరు పెట్టి విజయనగర సామ్రాజ్యమునునకు ప్రాణ ప్రతిష్ఠ గావించినారు. అందు హరిహర రాయని రాజుగను, బుక్కరాయని సేనాధిపతిగాను నియమించిరి. అతి శీఘ్రముగా సేనానివహమును సమకూర్చి తురుష్కుల దాడిని త్రిప్పికొట్ట సంకల్పించిది.
తాము హంపికి చేరువలో నుండుటకై తమ శిష్యుడైన చంద్రశేఖర భారతిని శృంగేరిలో కార్య నిర్వహణాధికారిగా నియమించి పీఠమును విరూపాక్షమునకు తరలించి దానిని శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠమని వ్యవహరించిరి. నాటినుండి శ్రీ శృంగేరి పీఠమునకు రెండు కేంద్రములయినవి.
శ్రీ విద్యారణ్యులవారు హరిహర బుక్కరాయలులకు అండగా నుండి మహమ్మదీయులను తరిమివేసిరి. నాటి నుండి 230 సంవత్సరములు విరూపాక్ష పీఠము, విజయనగర సామ్రాజ్యము అకుంఠిత ప్రభావముతో వెలుగొందెను. ఇట్లుండగా 1565 ఎ.డి.. లో తల్లి కోట యుద్ధము జరిగెను అప్పుడు మహమ్మదీయులు చెలరేగి హంపి విజయనగర సామ్రాజ్యమును ధ్వంసము చేసిరి. శ్రీ విరూపాక్ష పీఠమునకు అండ లేనందున స్థానము మార్చవలసి వచ్చినది. కొంత కాలము మహారాష్ట్రమున సందురించి, తదుపరి ఆంధ్ర దేశమునకు వచ్చి విజయనగరం రాజుల ఆదరముతో సుమారు 30 సం||లుండిరి. పిమ్మట గోదావరి జిల్లాలో పర్యటించు-గుంటూరు చేరిరి. పుర ప్రముఖుల ఆదరాతిశయమునుబట్టి, అరండల్ పేటలో "శ్రీసదనమను" ఒక భవనమును నిర్మించి తమ పీఠమునకచట స్థిరనివాస మేర్పరచుకొనిరి. అదియే శ్రీపీఠము. అందు ప్రథమ పీఠాధిపతి జగద్గురు కల్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వా మివారు. వీరికి 23-12-192 3న పట్టాభిషేకము జరిగినది. నీరు శ్రీ విద్యారణ్య భారతీస్వామి నుండి 43వ వారు. ఈ విషయములను శ్రీ కల్యాణానంద భారతీస్వామి వారు తమ మహా శ్రీముఖములో వెల్లడించిరి. అట్టి ఆ గురు పరంపరలో నేటి శ్రీ సత్యానంద భారతీస్వామి వారు 10వ వారు. ఎట్లన. 1. శ్రీ కల్యాణానంద భారతి 2. శ్రీవిమలానంద భారతి 3. శ్రీ సచ్చిదానంద భారతి. 4. శ్రీ శ్రీ త్రివిక్రమ రామానంద భారతి (కుర్తాళం) 5. శ్రీ విమలానంద భారతి 6. శ్రీ సత్యానందభారతీ స్వామి 7. శ్రీ చిదానంద భారతీస్వామి 8. శ్రీ ప్రకాశానంద భారతి స్వామి 9. శ్రీ సత్యానంద భారతి స్వామి-2, 10. శ్రీ కమలానంద భారతి స్వామివారు.
ఈ విధముగా “భారతీ” సాంప్రదాయ అవిచ్ఛిన్న యతి పరంపరతో ఈ పీఠము కాంతి పుంజములను వెదజల్లుతూ విలసిల్లుచున్న్నది.


