యువచైతన్య మహాపాదయాత్రలో మన భాగస్వామ్యం
దేవాలయ వ్యవస్థ పట్ల సమాజాన్ని చైతన్య పరచటంలో ఇప్పటివరకు చేసిన యాత్రలు మొదటి ప్రయత్నం. అయితే మన సమాజంలోని చిట్టచివరి గ్రామం చిట్టచివరి, హిందూ కుటుంబం వరకు మన సందేశాన్ని నేరుగా తీసుకొని వెళ్లాల్సి ఉంది. అంతేకాక చిట్టచివరి దేవాలయంతో సహా అన్ని దేవాలయాలు క్రియాశీలం అయ్యే వరకు ఈ ప్రయత్నం జరగాల్సి ఉంది.
- ప్రతి హిందువు ప్రతి కుటుంబము దేవాలయోస్ముఖం కావాలి.
- హిందూ యువత చైతన్యం కావాలి.
- మన ధర్మ సంస్కృతులను ప్రేమిస్తూ అవగాహన చేసుకుని ఆచరించాలి.
- ప్రతి దేవాలయం ఆధ్యాత్మిక ధార్మిక సమాజ సేవా కేంద్రంగా ఆవిష్కృతం కావాలి.
- ప్రతి దేవాలయం ఏదో ఒక సేవ కార్యక్రమాన్ని చేపట్టాలి.
- అందుకొరకు ప్రతి దేవాలయానికి ఒక సేవా ట్రస్ట్ ప్రారంభించుకోవాలి.
దేవాలయం కేంద్రంగా ఆ గ్రామంలోని లేదా బస్తీలోని 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న హిందూ యువతీ యువకులంతా సభ్యులు కావాలి. అలా యువత అంతా దేవాలయాన్ని ఆసరాగా చేసుకొని దేవిదేవతల ఆశీస్సులతో సమాజాన్ని, సమస్త ప్రాణికోటిని, యావత్ పర్యావరణాన్ని పరమేశ్వరి రూపంగా గ్రహించి, సేవించి, పరిరక్షించుకోవాలి. ఈ సందేశాన్ని తీసుకొని నేడు మరో మహాత్తర ధార్మిక చైతన్యం కొరకు పాదయాత్రలో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం.


