మహామాయ ఐన శ్రీ భువనేశ్వరి మాత విశ్వమంతటికి మహారాజ్ఞ్ని, హ్రీంకార బీజరూపిణి. పరమ శాంతి స్వరూపిణి. శ్రీ భువనేశ్వరి విద్య దశ మహావిద్యలలో నాల్గవది. అట్టి మాత ఆలయము ఆగమ శాస్త్రానుగుణంగా స్థపతుల స్థాపత్యంతో కృష్ణశిలతో నిర్మిస్తున్నాము.
దేవాలయ పవిత్రత, శాశ్వతత్వములను దృష్టిలో ఉంచుకొని ఈ విధముగా నిర్మించతలపెట్టినాము. ఒక్కదేవాలయ నిర్మాణము కొరకే రూ. 3.00 కోట్లు ఖర్చు అంచనా వేయబడింది.
అమ్మవారి మూలవిరాట్టు శక్తి పంచాయతనంతో ప్రతిష్ఠితమవుతుంది. విశేషంగా ఇక్కడ ప్రతిష్టించబడిన 17 ఆవరణలు, 367 శివలింగాలతో కూడిన మహిమాన్విత ఋతురసాగ్ని రుద్రమండలమును కూడా కృష్ణశిలతో పునఃనిర్మించి తిరిగి 367గురు దంపతులచేత 367 బాణ లింగాలు పునఃప్రతిష్టింప చేయబడును. అలాగే నిరంతరం అన్నదానం చేయుటకు, శాశ్వతమైన అన్నపూర్ణ పథకం నిర్వహించుటకు అన్నపూర్ణ నిలయం, వంటగది, వంట సామాగ్రి సమకూర్చుకొనవలెను.
సనాతన ధర్మనికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితులలో దేవాలయాలను, పీఠాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అందుకోసం మనవంతు సమర్పణను ధన, వస్తు రూపంగా అందించాలి. అందరూ తరలి వచ్చి ఈ మహత్ కార్యంలో సహకరించవలసినదిగా ప్రార్ధన.