Skip to main content

దేవాలయం కేంద్రంగా చేయూతగిన కొన్ని సేవా కార్యక్రమాలు

గ్రామములోని వారందరూ కలిసి చేయవలసినవి: 
హిందూ సంఘటన కార్యక్రమాలు, సదస్సులు, వకృత్వ వ్యాసరచన కంఠస్థ పోటీలు, దేశభక్తుల చరిత్ర పుస్తక పఠనం, దేశభక్తుల జన్మదినోత్సవాలు, పర్యావరణ మొక్కలు నాటడం, పండ్ల మొక్కలు పిల్లలకి వితరణ, దళిత గిరిజనుల గ్రామాలలో దేవాలయాల నిర్మాణం, ధార్మిక లఘు చిత్రాల నిర్మాణం, ధార్మిక పత్రికల పట్టణం ప్రచారం, దీక్ష మాల ధారణం, ధర్మరక్ష మాల ధారణం, జన్మదినోత్సవం, శుభ కార్య సందర్భంగా భగవద్గీత రామాయణం ఇవ్వడం, పేద ఆడపిల్లల వివాహాలు, పేద ఆడపిల్లల చదువు, పేద ఆడపిల్లల భద్రత; హిందూ హిత సంస్థలను ప్రోత్సహించటం - సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో జన్మదినోత్సవం.

హిందూ సమాజం:
ధార్మిక సృహ కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ధర్మావలంబనం, సామాజికంగా కార్యక్రమాలలో పాల్గొనటం, ఇంట్లో ధార్మిక గ్రంధాలయం, మంచి సాహిత్య పఠనం, టీవీలలో ధార్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనం, భజన, గ్రామ ఉత్సవాలలో పాల్గొనటం, అకృత్యాల పట్ల స్పందన, కళల ప్రోత్సాహం, పోషణ, ధర్మరక్షణ, ధర్మ ప్రచారం, మఠాలు, ఆశ్రమాల సందర్శనం, సంరక్షణ, వేసవిలో చలివేంద్రం, వైద్య, ఆరోగ్య, మాత, శిశు కేంద్రాలు, నేత్ర చికిత్స శిబిరాలు, గోశాల, పశు వైద్యశాలల నిర్వహణ.

మన దేవాలయం:
దేశభక్తికి, దైవభక్తికి దేవాలయం ఆధారం. 
దేవాలయం లేని గ్రామంలో నివాసం ఉండరాదు. 
దేవాలయంలో కేవలం విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం లేదు, విగ్రహానికి ప్రాణాన్ని ప్రతిష్ట చేస్తున్నాము. 
ఉచ్చ్వాస, నిశ్వాసం ఉన్న అంటే ప్రాణంతో ఉన్న దేవుడిని ఎదురుగా ఉంచుకొని దేవాతార్చన చేసుకునేది ప్రపంచంలో హిందువులు మాత్రమే. 
దేవాలయంలో నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతుంటే గ్రామంలోని ప్రజలు, పశుపక్ష్యాధులు, పాడిపంటలు, జల వనరులు సమృద్ధిగా ఉండి గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది అని అగమ శాస్త్రం చెబుతోంది.