శ్రీ భువనేశ్వరి పీఠమున కార్యక్రమములు
- నిత్యము ప్రాతస్సాయములయందు శ్రీ చక్రార్చన, ప్రతి పూర్ణిమనాడు శ్రీ చక్రనవావరణార్చన, ప్రతి మాస శివరాత్రి రుద్రమండలమునకు మహన్యాస పూర్వక మహాభిషేకము.
- చైత్ర శుద్ధ పూర్ణిమ చిదానంద సరస్వతీ స్వామివారి జయంతి, ఆశ్రమ వార్షికోత్సవము.
- వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి.
- వైశాఖ బ||దశమి హనుమజయంతి, కల్యాణోత్సవము.
- జ్యేష్ట శుద్ధ అష్టమి శ్రీ సత్యానంద భారతీ స్వామి వారి ఆరాధన.
- ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూజ, చతుర్మాస్యారంభము.
- శ్రావణ బహు పాడ్యమి శ్రీ కృష్ణ జయంతి.
- భాద్రపద శుద్ధ పాడ్యమి శ్రీ చిదానంద సరస్వతీ స్వామి వారి ఆరాధన.
- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దేవి నవరాత్రోత్సవములు.
- నవరాత్రోత్సవములందు ప్రతి దినము శ్రీ చక్ర నవావరణార్చనలు - సువాసినీ పూజలు - కుమారి పూజలు - గోపూజ - కుంకుమార్చనలు - రుద్ర మండలాభిషేకము - చండీ యాగము మొదలైనవి.
- విజయ దశమి శ్రీ సత్యానంద భారతీస్వామి వారి జయంతి.
- ఆశ్వయుజ బహుళ సప్తమి శ్రీ భువనేశ్వరీదేవి జన్మదినోత్సవము.
- కార్తీక మాసము నెలరోజులు రుద్ర మండలమునకు మహాన్యాస పూర్వక మహాభిషేకములు.
- కార్తీక శు॥ పూర్ణిమ రాత్రి సహస్ర దీపోత్సవము - సమారాధనము.
- మార్గశిర శుద్ధ షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణము.
- మాఘ బ॥ చతుర్దశి మహా శివరాత్రి రుద్ర మండల మహాభిషేకము.
ఇవికాక ఇంకనూ విశేషదినములందు - ఆయా కార్యక్రమములు నిర్వహింపబడుచున్నవి.


