శ్రీ సత్యానంద భారతి స్వామి-2

శ్రీ ప్రకాశనంద భారతి స్వామి వారు శ్రీ సత్యానంద భారతి స్వామి వారిని మనసునందే నిర్దేశించుకొని ఆదరించి ఉత్తరాధికారులుగా ప్రకటించి పట్టాభిషేకమును గావించినారు. శ్రీ సత్యానంద భారతీ స్వామిII వారు ఈ పీఠ నిర్వహణ బాధ్యతలను స్వీకరించి మధ్యలో కొంత సన్నగిల్లిన పీఠ వైభవమునకు పూర్వస్థితిని తిరిగి సంతరించుటకై ఆలోచనా చిత్తులై పరితపించుచు పరమేశ్వరికి సేవలకు, ఆశ్రమమునకు ఆదాయ మార్గములనన్వేషించిన - కర్మ యోగి-ధర్మ యోగి పరమ నైష్ఠికులు-సమాజ సేవకులు - స్వయం సేవకులు - సేవాతత్పరులు.
శ్రీ స్వామివారు పీఠాధిపత్యమునందు నిరాసక్తులై, అంతర్ముఖులై తపమాచరించుటకు తమ ఉత్తరాధికారిగా శ్రీ కమలానంద భారతి స్వామి వారిని ప్రకటించి పట్టాభిషిక్తులను చేశారు. శ్రీ స్వామి వారు సమాజానికి మార్గదర్శనం చేస్తూ క్రోధి సం. వైశాఖ బహుళ సప్తమి (30-05-'24) నాడు బ్రహ్మైక్యము చెందిరి.


